నందికొట్కూరు నియోజకవర్గం. పగిడ్యాల మండలంలోని బీరవోలు ,ఆంజనేయ నగర్ గ్రామాల్లో వచ్చిన అతి సారా వ్యాధి తగ్గు ముఖం పట్టిందని వైద్యాధికారులు తెలిపారు.
సోమవారం మండల పరిషత్ అధికారి మాట్లాడుతూ గ్రామాల్లో 12 ట్యాంకర్లతో మంచినీటి సప్లై చేశామని ఇంటింటికి నీరు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మినీ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ ద్వారా శుభ్రపరిచి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు.
[zombify_post]

