in ,

పెరుగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి

పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మండలంలోని రేగుబల్లి దంతెనం,నరసాపురం తదితర గ్రామాలలో వ్యవసాయ కూలి రేట్లు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.రేట్లు పెరిగే అంతవరకు సమ్మె కొనసాగించాలని వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. నిత్యవసర సరుకుల ధరలను  ప్రభుత్వాలు పెంచుతున్నప్పుడు వాటికి  అనుకూలంగా కూలి రేట్లు సైతం పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో జక్కం సావిత్రి,పుట్టి సావిత్రి,షకీలా అమృతమ్మ,షకీలా సుధారాణి , జెట్టే  పద్మ,కాలవ పాపమ్మ,జెట్టి మనోరమ్మ, కాలవ పెంటమ్మ  తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

సునీత విజ్ఞప్తి.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

సాగు భూములకు పట్టాలు మంజూరు చేయ్యాలి