in , ,

గిరిజ‌న ప్రాంతంలో విద్య వెనుక‌బ‌డి ఉంది: జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

పాడేరు, అల్లూరి జిల్లా:  విద్యారంగంలో  గిరిజ‌న ప్రాంతం వెనుక‌బ‌డి ఉంద‌ని  జిల్లా క‌లెక్ట‌ర్  సుమిత్ కుమార్ స్ప‌ష్టం చేసారు. సోమ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో  విలేఖ‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  విలేఖ‌రుల‌తో మాట్లాడుతూ   2011 జ‌న‌గ‌ణ‌న ప్ర‌కారం  ఏజెన్సీలో 53 శాతం  అక్ష‌రాస్య‌త ఉంద‌న్నారు. మ‌హిళ‌ల   అక్ష‌రాస్య‌త 39 శాతం మాత్ర‌మే ఉంద‌ని పేర్కొన్నారు.  ఈనెల 9 వ‌తేదీన రాష్ట్ర  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించార‌ని చెప్పారు. ఏజెన్సీలో 10 వేల మంది ఉపాధ్యాయులు  ఉన్నార‌ని వారంద‌రు పాఠ‌శాల‌ల‌కు స‌క్ర‌మంగా హాజ‌రు కావాల‌న్నారు. పంచాయ‌తీరాజ్‌, వైద్య  ఆరోగ్య‌శాఖ‌,  ఇంజ‌నీరింగ్ విభాగాలు, స‌చివాల‌యం సిబ్బంది, రెవెన్యూ అధికారులు  స‌మ‌యపాల‌న పాటించి  నిర్దిష్ట‌మైన స‌మ‌యానికి విధుల‌కు హాజ‌రు కావాల‌న్నారు.  విధుల‌ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే  క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఏజెన్సీలో ఎవ‌రూ ప్రత్యేకంకాదు స‌మ‌యానికి వ‌చ్చి ఫేషియ‌ల్ అటెండెన్సు వేయాల‌న్నారు.  ఎవ‌రిపైనా  అన్యాయంగా  చ‌ర్య‌లు తీసుకోమ‌న్నారు.  విద్యార్దులంద‌రు పాఠ‌శాల‌ల‌కు రావాలన్నారు. గిరి శిఖ‌ర గ్రామాల్లో  అద‌నంగా పాఠ‌శాల‌లు నిర్మించుకోవ‌ల‌సిన అవ‌స‌రం  ఉంద‌న్నారు. విద్య‌ను బ‌లోపేతం చేయాల‌న్నారు. విద్యా వాలంటీర్ల‌ను నియ‌మించుకోవ‌ల‌సిన అవ‌స‌ర ఉంది. పాఠ‌శాల‌ల్లో  క్ర‌మ‌శిక్ష‌ణ ఉండాలి, పాఠ‌శాల‌ల‌కు మ‌ద్యం సేవించి వ‌స్తే, అవినీతికి పాల్ప‌డితే, ఉపాధ్యాయులు  విధుల‌కు  రాక‌పోతే  , స‌మ‌య‌పాల‌న పాటించ‌క‌పోతే ఉపాధ్యాయుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామని చెప్పారు. సామాజిక మాధ్య‌మాల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం  స‌రికాద‌న్నారు.  లీడ‌ర్ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించ కూడ‌దని చెప్పారు. కార్యాల‌యాల‌కు స‌మ‌యానికి రావాలి, స‌మ‌యానికి బ‌య‌ట‌కు వెళ్లాలి అన్నారు.

[zombify_post]

Report

What do you think?

కదం తొక్కిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్

తెలంగాణ సాయుధ పోరాట 75 వ వార్షికోత్సవం