in ,

రామచంద్రపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అరెస్టు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టిడిపి నాయకులు రామచంద్రపురంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దీక్షను భగ్నం చేసి టిడిపి నాయకులను,కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో రెడ్డి సుబ్రహ్మణ్యం వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు ఎలా చేస్తారు అంటూ ఆయన వాపోయారు. నోటీసు ఇచ్చిన వెంటనే తనే స్వయంగా వస్తానని చెప్పారు. అయినా సరే సుబ్రహ్మణ్యాన్ని ఆయనతో పాటు మహిళలను,కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

సత్యానందరావు సామూహిక సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపిన వివిధ సంఘలు

ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం