in ,

చంద్రబాబు అరెస్ట్ తో జాతీయ రహదారిపై నిరసనలు

చంద్రబాబు అరెస్ట్ తో జాతీయ రహదారిపై నిరసనలు

ప్రజాస్వామ్యం కూని కాబడింది… ఈ రోజు బ్లాక్ డే: మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

 నందిగామ , సెప్టెంబర్ 9,గురు న్యూస్:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే సౌమ్య,టిడిపి నాయకులను గృహనిర్బంధం చేశారు.అక్రమ అరెస్టును ఖండిస్తూ గృహనిర్బంధంలో ఉన్న మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు ఇంటిలోనే దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేదు,ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు.తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు అన్నారు.మీ అరాచక పాలనను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.చంద్రబాబు అరెస్ట్ జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు పరాకాష్ట,జగన్ రెడ్డి ఎంత కక్షతో రగిలిపోతున్నాడో చంద్రబాబు అరెస్టే నిదర్శనం అన్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ అక్రమ అరెస్టుకు తెరలేపి జగన్ రెడ్డి పైశాచిక ఆనందాన్ని పొందాడు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై ఏనాడో విచారణ జరిగి దానిమీద ఎటువంటి అభియోగాలు లేవని క్లీన్ చీట్ కూడా ఇచ్చారు.జగన్ రెడ్డి ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నాడు.అధికార పార్టీ ఏం చేసినా చూస్తూ ఉండాలా,అరెస్ట్ లు చేయించి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు.ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు, లోకేష్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిపై ఒక్క చర్యలు లేదు.మేము ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా,జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం నేరంగా మారింది.వైసీపీ అరాచక పాలనపై పోరాటం ఆగదు.ఏదైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.చంద్రబాబు ని వెంటనే విడుదల చేయాలి.ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుంది అన్నారు.అనంతరం సౌమ్యను అరెస్టు చేసి వీరులపాడు స్టేషన్ కు తరలించారు..సౌమ్య ఇంటి వద్దకు భారీగా చేరుకున్న టిడిపి నాయకులు అనంతరం మునగచర్ల, అంబారుపేట క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలు భారీగా వాహనాలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రహదారిపై ధర్నా చేస్తున్న టిడిపి నాయకులకు టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు సంఘీభావం తెలియజేశారు. ధర్నాలో పాల్గొన్న టిడిపి నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రాము, కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణలత, టిడిపి నాయకులు అమ్మినేని జ్వాల ప్రసాద్, కొండూరు వెంకటరమణ, ఏ వన్ శ్రీనివాసరావు, సజ్జ అజయ్ మండవ శ్రీను, ఉన్నాం నరసింహారావు ,చలమల కృష్ణ, షేక్ ఖాజా, షేక్ ఇమాంజాని, ఇస్మాయిల్, సయ్యద్ రసూల్, ఈఊరి వినోద్, వేజెండ్ల వంశీ, దారెల్లి బుజ్జి, తోటకూర సూర్యనారాయణ, దామాల రవి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను సద్వినియోగం చేసుకోవాలి*

బిగ్ బ్రేకింగ్ న్యూస్…..చంద్రబాబు అరెస్ట్.. తాడేపల్లిలో గుండెపోటుతో అభిమాని మృతి