in ,

జిల్లాల అభివృధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా: సీఎస్ జవహర్

పాడేరు, అల్లూరి జిల్లా: జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేసారు. అల్లూరి సీతా రామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు జిల్లాలలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి వచ్చానని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గా సేవలందించానని రంపచోడవరం, భద్రాచలం పి ఓగా సేవలందించడం వలన చింతూరు, కూనవరం, వి. ఆర్.పురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంతాలపై అవగాహన ఉందన్నారు. మాతా శిశు మరణాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. రహదారులు, తాగునీటి సమస్యలు, విద్యా సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. పాడేరు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నప్పుడు కలెక్టర్ రావాలంటే చాల కష్టంగా ఉండేది, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ స్థానికంగా అందుబాటులో ఉన్నారని చెప్పారు. పార్వతీపురం సీతంపేట ప్రాంతాల కంటే అల్లూరి సీతారామ రాజు జిల్లాలో సేవలందించం ఇబ్బంది కరంగా ఉంటుందాన్నారు. పాడేరు డివిజన్లో పని చేస్తున్న అధికారులను అభినందించారు. తాగునీటి సదుపాయాలు, రహదారుల నిర్మాణాలకు నిధలు మంజూరు చేస్తామన్నారు. హైరిస్క్గర్భవతులను ప్రసవ సమయానికి తరలించాలని చెప్పారు.                                  నెల రోజులు ముందుగా అసుపత్రులకు
అల్లూరి సీతా రామ రాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రీ సర్వే, అటవీ హక్కుపత్రాలు పంపిణీ, గృహ నిర్మాణాలు, జల్ జీవన మిషన్లో చేపట్టిన తాగునీటి పథకాల నిర్మాణాలు, ఐసిడి ఎస్ సేవలు, వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు, కాఫీ తోటలు పెంపకం, మనబడి నాడు నేడులో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు, వైద్య సేవలు, కీటక జనిత వ్యాదుల నివారణ చర్యలు, సికిల్సెల్ ఎనిమియా పరీక్షలు, రహదారుల నిర్మాణాలు ఎస్ సి ఎ ( స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్) కింద మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో ఆపరేషన్ పరివర్తన్ కింద గంజాయి నిర్మూలనకు చేపట్టి చర్యలను వివరించారు. గంజాయి సాగు స్థానంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, ఉద్యానవన మొక్కలు పంపిణీ చేసామని చెప్పారు. ముందుగా అల్లూరి సీతా రామరాజు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమావేశం అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో సి. ఎస్. మొక్కలు నాటారు. ఆతరువాత వైద్య కళాశాల నిర్మాణపు పనులు పరిశీలించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్ రంప చోడవరం పి ఓ సూరజ్ గనోరే, సీతంపేట పి ఓ కల్పనా కుమారి, పార్వతీపురం పి ఓ సి . విష్ణు చరణ్ రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్, అల్లూరి సీతా రామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల జిల్లా అధికారు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆందోళన

మాజీ మంత్రి అయ్యన్న తండ్రి, తాతయ్యల విగ్రహాల ఆవిష్కరణ