యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం
యువతకు ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు గజపతినగరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెదిరెడ్ల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం గంట్యాడ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత రోడ్డున పడ్డారని ఆరోపించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న పట్టించుకోవడంలేదని, పదవ తరగతి పిల్లలు కూడా గంజాయి తాగే పరిస్థితి దాపురించిందన్నారు.
[zombify_post]
