అర్హులైన వారందరికీ గృహ లక్ష్మి పథకాన్ని అమలు చేయాలని రేషన్ కార్డులు ఉన్న లేకపోయినా ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కొరకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ప్రభుత్వ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్న నిర్వహించటం జరిగింది. అనంతరం మండల తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు గంటా శ్రీనివాసన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో ప్రజలను వంచించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వస్తున్నదని, ఎన్నికల దగ్గర పడటంతో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకోమని మూడు రోజుల గడువు ఇచ్చి కటప్ చేయడం జరిగిందని అన్నారు. దాదాపుగా రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదలు ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్నారని, నేడు రేషన్ కార్డులు ఉన్నవారికి ఇస్తామని అంటూ ప్రకతించగ కొత్తవి ఇంకా ఇవ్వ లేదన్నరు. ఇంటి స్థలం లేని వారు చాలామంది ఉన్నారని, వారికి ఇంటి స్థలాలు ఇవ్వటంలో, రేషన్ కార్డులు ఇవ్వడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. టిఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయలేదన్నరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి డబల్ బెడ్ రూములు విషయంలో పూర్తిగా విఫలం చెందింద ని వారు అన్నారు. సత్తుపల్లి మండలంలో అధికార పార్టీ నాయకులు శాసనసభ్యులు అండ చూసుకొని గ్రామీణ ప్రాంతాలలో ఎవరికి ఇల్లు ఇవ్వాలనే విషయంలో అధికారుల తో, ప్రజల తో సంబంధం లేకుండా లిస్టు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ నాయకులు అమర్లపుడి శరత్ మండల కార్యదర్శి తాటి రాజు, కొర్స వెంకటేష్, రుద్రాక్షపల్లి ఉపసర్పంచ్ దుంప రాఘవులు. నెక్కొండ అలివేలు, పాండ్ల నాగరాజు, శ్రీను, వెంకటమ్మ, సురేష్, నడకుదురు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]


