in

ఇండియా భారత్ రెండు ఒకటే-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భారత జాతిని ఏక తాటిపైకి తీసుకు వచ్చి, దేశ సమగ్రతను కాపాడేందుకు  ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది గడిచిన  నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి అధ్వర్యంలో గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాద యాత్ర చేపట్టారు.ఇందిరా భవన్ నుండి తహసిల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని  పాదయాత్రగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు  భారత్ జోడో యాత్రను చేపట్టి ప్రజలను చైతన్య పరిచారు.రాజీవ్ గాంధీ ప్రపంచానికి  శాంతి సందేశం అందజేశారని తెలిపారు.
బలహీన వర్గాలు, సంక్షేమం కోసం పనీచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టన్నారు.
మోడీ భారత్ అను కొత్త నినాదం తీసుకు వచ్చినట్లు..ప్రచారం చేసుకోవడం విడ్డురామని పేర్కొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఇండియా.. భారత్ రెండు ఒక్కటే.. వేర్వేరు కాదన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

సుందర సత్సంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

గిరిజన తండాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు