in ,

సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

– రామగుండం పోలీస్ కమిషనరేట్

– సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

 పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గెస్ట్ హౌస్ లో ఈ రోజు బుధవారం నిర్వహించిన సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం
రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐ జి) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి సమావేశము జరిగినట్లు తెలిపారు.ఎన్నికల ముందు ఎన్నికల సమయం లో జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా,ఎన్నికల ముందు, ఆ సమయంలో మద్యం,నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి మహేష్, సిఐ బి అనిల్, ధర్మారం ఎస్సై టి సత్యనారాయణ, వెలుగటూర్ ఎస్సై శ్వేత, చొప్పదండి ఎస్ఐ చారి, మల్యాల సిఐ కోటేశ్వర్, మరియు  జగిత్యాల డిఎస్పి లక్షట్ పేట సిఐ బసంత్ నగర్ బీర్పూర్ పెగడపల్లి జన్నారం ఎస్సైలు    పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

వైస్ చైర్మన్ పదవి మాల సామాజిక వర్గానికి – హర్షం వ్యక్తం చేసిన: జై భీమ్ శ్రీనివాస్*

ఎన్నికల శంఖారావం పూరించిన ఎమ్మెల్యే సతీశ్ కుమార్