in ,

నేరుడువలసలో నా భూమి నా దేశం కార్యక్రమం

పాడేరు నియోజకవర్గం , అల్లూరి సీతారామరాజు జిల్లా: బీజేపీ అధిష్టానం ఆదేశాలు మేరకు ఢిల్లీ లో అమృత వనం నిర్మాణం కోసం పాడేరు అసెంబ్లీ లో మట్టి సేకరణ చేస్తున్నామని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు, మంగళవారం         నా భూమి-నా దేశం కార్యక్రమం అరకు పార్లమెంట్ జిల్లా పాడేరు అసెంబ్లీ పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ నేరుడు వలస గ్రామంలో ఇంటిఇంటికీ వెళ్లి అమృత వనం నిర్మాణం కోసం మట్టి సేకరణ చేసారు ,ఈ కార్యక్రమంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఢిల్లీ లో స్వతంత్ర సమరయోధుల స్మృతి అమృత వనం నిర్మాణం కోసం మట్టి సేకరణ చేయడం,ఈ ప్రాంతాల్లో ఉన్న  స్వాతంత్ర్య సమ్మరయోధుల విగ్రహాలు కు నివాళులు అర్పించడం ,పవిత్రమైన మట్టి ని దేవాలయాల్లో ,స్వాతంత్ర్య సమరయోధులు నడయాడిన ప్రాంతాల్లో మట్టి సేకరణ చేయనున్నారు ఈ కార్యక్రమం సెప్టెంబర్1 నుండి15 తేది వరకు చేయనున్నామని తెలిపారు ,ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సి మోర్చా కోనసీమ జోనల్ ఇంచార్జి రవికుమార్ పెనుమాక, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల పాత్రుడు,యువ మోర్చా కార్యకర్తలు నెరుడువలస గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

పిడుగు పడిన సమయంలో సెల్ఫోన్ పేలి యువకుడు మృతి

7న ఇస్కాన్ అహోబిలం లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు