పాడేరు: వైద్యాధికారుల నివాస గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్ ఆదేశించారు. రూ.1.కోటి 50 లక్షల న ఓ జి ఐ ఎ నిధులతో స్థానిక మలేరియా కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న వైద్యాధికారుల నివాస భవన నిర్మాణపు పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలలో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని సూచించారు. ప్రవేశ మార్గం,పార్కింగ్, మరుగు దొడ్ల సెప్టిక్ ట్యాంకు నిర్మాణాలపై పలు సూచనలు చేసారు. వేగంగా పూర్తి చేసి వినియోగం లోకి తీసుకుని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ డి వి ఆర్ ఎం.రాజు, డి. ఇ. అనుదీప్ , ఎ ఇ, దేముళ్లు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
 
					
 
			
			 
			
					
