in ,

జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధుల

జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి..

బి.గిడ్డయ్య …….. సిపిఐ జిల్లా కార్యదర్శి,  

ఆదోని…జిల్లాలో అత్యంత వెనుకబడిన పశ్చిమ (ఆదోని డివిజన్)ప్రాంతానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయము నందు పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ సహాయ కార్యదర్శి కామ్రేడ్, విజయ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోబి.గిడ్డయ్య మాట్లాడుతూ…. రాష్ట్రంలో నే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆదోని డివిజన్ ప్రాంతమని సాగునీరు త్రాగునీరు లేక ప్రజలకు ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు వలస పోయి దుర్భర జీవితం గడుపుతున్నారని,ఈ ప్రాంత అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని, దీని కారణంగా మరింత ఈ ప్రాంతం వెనుకబడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆదోని, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, నియోజకవర్గాల ప్రజలు తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అలమటిస్తున్నారని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద విధులు కేటాయించి ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు వేదవతి ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తిచేస్తే లక్షలాది ఎకరాలు కు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు సమృద్ధిగా వస్తుందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టుల్లో ఏ మాత్రం పురోగతి లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన గురవుతున్నారని, పత్తికొండ నియోజకవర్గం లో ఉన్న చెరువులను హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా నింపడం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అనేక గ్రామాలకు త్రాగునీరు వస్తుందని చెరువులను నింపడానికి ప్రభుత్వం పూనుకోవాలని ఆయన అంటూ, పంట పొలాలను నాశనం చేసినటువంటి జింకలను నివారించడానికి ఆలూరు ప్రాంతంలో జింకల పార్క్ ఏర్పాటు కోసం, ఆదోని, ఎమ్మిగనూరు లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, పత్తికొండ ప్రాంతంలో టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం, నిధులు కేటాయించి పూర్తి చేస్తే వేలాది మందికి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని వలసలు నివారించవచ్చని ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విధులు కేటాయించి  వెనుకబాటుతనాన్ని రూపుమాపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే.అజయ్ బాబు,సిపిఐ సీనియర్ నాయకులు కే.లక్ష్మిరెడ్డి, పట్టణ కార్యదర్శి S.సుదర్శన్, మండల కార్యదర్శి బి.రాజు ఏఐటీయూసీ నాయకులు వెంకన్న, ఓ.బి.నాగరాజ్,వై.టి భీమేష్ సిపిఐ నాయకులు బస్సాపురం గోపాల్,షేక్షావలి హర్ష ద్, మెకానిక్ వలి, నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

దళిత ఎస్సై ఆత్మహత్యపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపిన ట్రైనింగ్ డిఎస్పి ధీరజ